బీసీల ఉద్యమానికి యువత సైనికుల్లా మారాలి
– సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– పెద్దేముల్ మండలం యువజన సంఘం అధ్యక్షులుగా నవీన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల హక్కుల సాధన కోసం సాగించే ఉద్యమంలో యువత సైనికుల్లా మారి ముందుకు తీసుకెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీ యువజన సంఘం పెద్దేముల్ మండలం అధ్యక్షులుగా నవీన్ ను నియమించారు. శనివారం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రావణ్ కుమార్ సమక్షంలో నవీన్ కు నియామక పత్రం అందజె శారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య స్పూర్తితో బీసీ సంఘం ఆద్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో ఎంతో మంది యువత, విద్యార్థి దశ నుంచే పాల్గొంటూ చురుకైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. ఇక ముందు కూడా బీసీల ఉద్యమంలో యువత సైనికుల్లా ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా మండల యువజన సంఘం అధ్యక్షులుగా నియామకమైన నవీన్ బీసీల ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి చేరే విధంగా చూడాలన్నారు.
మరోవైపు తనకు మండల యువజన అధ్యక్ష పదవి అప్పగించడం పట్ల నవీన్ ఆర్. కృష్ణయ్య, రాజ్ కుమార్, షుకూర్, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ మహేందర్, బీసీ సంఘం నియోజకవర్గ నాయకులు యాలటి శ్రీనివాస్, అరుణ్ రాజ్, స్వేరోస్ శివకుమార్, కేశవులు, బలరాం, వెంకట్, మొగులప్ప, నర్సింలు, రమేష్, సాయిలు, అనిల్, లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

