యువకుడిపై దాడికి పాల్పడడం దుర్మార్గం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

యువకుడిపై దాడికి పాల్పడడం దుర్మార్గం..!
– దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– హింధూ సంఘాల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోబైల్‌లో చేసిన పోస్టును అడ్డం పెట్టుకుని కొందరు యువకుడిపై దాడికి పాల్పడడం దుర్మార్గమని తాండూరు హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. యువకుడిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన వడ్డె రవి అనే యువకుడు మంగళవారం ఉదయం తన మోబైల్‌లోని సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. ఇది గమనించిన కొందరు తమ వర్గాన్ని అవమాన పరిచే విధంగా ఉందని ఆందోళనకు దిగారు. పోస్టు పెట్టిన రవిని రాత్రి అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అదే రాత్రి యువకుడిని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకవచ్చి క్షమాపణలు చెప్పే విధంగా ఒత్తిడి తీసుకవచ్చారు.

బుధవారం ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు హిందూ వాహిని, భజరంగ్ దళ్ నాయకులు దాడిని ఖండించారు. యువకుడిపై దాడి చేయడమే కాకుండా అతని తల్లిని, చెల్లిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువకుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్