బీజేపీలో బాలేశ్వర్ గుప్తకు ప్రత్యేక స్థానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీలో బాలేశ్వర్ గుప్తకు ప్రత్యేక స్థానం..!
– జిల్లా ఎలక్షన్ కన్వీనర్ గా నియామకం
– హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండల మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు బాలేశ్వర్ గుప్తా భారతీయ జనతా పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర అధిష్టానం వికారాబాద్ జిల్లా ఎలక్షన్ కన్వీనర్ గా బాధ్యతలు కట్టబెట్టింది.

సామాన్యుడికి కూడా అందలంవేసే బిజెపి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. గ్రామపంచాయతీ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తాళ్లపల్లి బాలేశ్వర గుప్తా అంచలంచలుగా ఎదుగుతూ యాలాల మండల పీఏసీఎస్ చైర్మన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మండల వ్యాప్తంగా తనకున్న పేరు ప్రఖ్యాతులు, మంచి పేరుతో ఎంపీపీగా యాలాల మండల బాధ్యతలు స్వీకరించి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు.

2009వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ తరపున తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. జిల్లా వ్యాప్తంగా యాలాల మండలం నుండి అత్యధిక ఓట్లను బీజేపీకి అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తాండూరు నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు యాలాల మండలం నుండే రావడం బాలేశ్వర గుప్తా అంకిత భావానికి, అకుంఠిత దీక్షకు ప్రత్యక్ష నిదర్శనం. తనకు అప్పగించిన ఏ చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా అలవోకగా భుజస్కందాలపై వేసుకొని విజయ తీరాలకు చేర్చడంలో బాలేశ్వర గుప్తాకు ఎదురు లేదు. రాష్ట్ర అధిష్టానం వికారాబాద్ జిల్లా ఎన్నికల కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, ఆ బాధ్యతను ముందుకు తీసుకు వెళ్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయానికి కృషి చేయడమే కాకుండా ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా బాలేశ్వర గుప్త తెలిపారు. తనకు ఇంత గొప్ప బాధ్యతను కట్టబెట్టిన పార్టీ అధిష్టానానికి, తనపై నమ్మకం ఉంచి తనకు పదవినందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుకి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన వెన్నంటి ఉంటూ తన విజయంలో క్రియాశీలక భూమిక పోషించిన బీజేపీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బాలేశ్వర్ గుప్తా జిల్లా ఎన్నికల కన్వీనర్ గా నియామకం కావడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి…

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం