శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు

తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు

– దర్శించుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు సోమవారం ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు.

ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర ప్రధాన వీదుల గుండ కొనసాగింది. అంతకుముందు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలతో దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవా ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఊరేగించిన అమ్మవారి ప్రతిమ ఆకట్టుకున్నాయి.

అంతేకాకుండా ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, కళాకారుల డప్పు ప్రదర్శనలు కనువిందు చేశాయి. ఈ ఉత్సవ ఊరేగింపులో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, దె వాలయ చైర్మన్ పి.బస్వరాజ్, ఈఓ నరేందర్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆదేవిధంగా ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మరోవైపు కాళీకాదేవి జాతర ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదికూడా చదవండి…

వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..!