భక్తి భావం అలవర్చుకోవాలి
– ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– ఎన్టీఆర్ కాలనీ పోచమ్మ దేవాలయంలో అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకోవాలని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ దేవాలయం వద్ద బోనాల ఉత్సవాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాలకు విఠల్ నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలకు హాజరైన భక్తులకు విఠల్ నాయక్ తన చేతుల మీదుగా అన్నదానం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక శాంతి లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావం ఏర్పరుచుకోవాలని అన్నారు. అమ్మవారి కృపతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు జగన్ గౌడ్, వెంకటేష్, చెన్నారెడ్డి, జగన్ మెకానిక్, టైలర్ నాగప్ప, నాగరాజ్, మహిపాల్ రెడ్డి, వీరణ్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

