ఇదెక్కడి ట్రాఫిక్ జామ్‌రా బాబు..!
– తాండూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జీపై పరేషాన్
– దాటాలంటే బాబోయ్ అంటున్న జనం
– ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం ట్రాఫిక్ జామ్ రా నాయనా.. అంటూ ఓ వ్యాపారి, ఓ విద్యార్థి, ఓ ఉద్యోగి అర్దనాది ఇది. తాండూరు పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న నిత్యం ట్రాఫిక్ జామ్ వల్ల అందరు పరేషాన్ అవుతున్నారు.

గురువారం ఉదయం తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందే వర్షాలు పడుతుండడంతో వాహనాదారులు ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఓ లారీ మొరాయించడంతో జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చిక్కుకుపోయాయి. బైకులు, స్కూటీలు, జీపులు, ఆటోలు, కార్లు, ఆర్టీసీ బస్సులు, లారీలు అన్నీ దిగ్బంధమయ్యాయి. గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో పాఠశాలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు బస్సులు నడుచుకుంటా ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగారు. పనులకు వెళ్లే సామాన్య జనం సైతం నడుచుకుంటూనే వెళ్లారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న ప్రతి ఒక్కరు ఇదేం ట్రాఫిక్ జామ్‌రా నాయనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తరలించారు. చాలా సేపటి తరువాత ట్రాఫిక్ జామ్ తొలగిపోవడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి….

