
అమ్మాయిలు.. భళా..!
– అభాగ్యురాలి పట్ల మానవత్వం
– రేయిన్ కవర్, పండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకునే అమ్మాయిలు తమ వయస్సు మించిన ఆలోచనతో మానవత్వం చాటుకుని అందరి చేత భళా అనిపించుకున్నారు. వర్షంలో తడుస్తున్న ఓ అభాగ్యురాలు పట్ల సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.

తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిలు తమ కాలేజీ ముందు భాగంలో మతిస్థిమితం లేని ఓ అభాగ్యురాలును చూసి చలించిపోయారు. గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షంలో తడుస్తున్న అభాగ్యురాలు గురించి ఎవ్వరు పట్టించకోలేదు. దీంతో అమ్మాయిలు తమ వయస్సుకు మించిన ఆలోచనతో అభాగ్యురాలుకు చేయూత అందించారు. వర్షంలో తడకుండా ఆమెకు రేయిన్ కవర్ కప్పి.. అందించారు. అదేవిధంగా ఆమె ఆకలిని గుర్తించి పండ్లు అందజేశారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు అమ్మాయిలను భళా అని మెచ్చుకున్నారు. కాలేజీ అధ్యాపకులు కూడా అభినందించారు.

ఇదికూడా చదవండి..

