బ్లేడుతో గొంతుకోసుకున్న భర్త
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన
– చివరకు అతని పరిస్థితి ఏమయ్యిందంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భార్యతో గొడవ పడిన ఓ భర్త బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. ఈసంఘటన తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల రవి భార్య నిన్న తల్లిగారింటికి వెళ్లింది. ఒకరోజు ముందే ఇద్దరి మద్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. గురువారం ఉదయం మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రవి మెడ నిండా రక్తగాయాలయ్యాయి.

గమనించిన కుటుంభీకులు, స్థానికులు చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. కుటుంభీకులు రవిని హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గ్రామంలో కలవరం రేపింది.

ఇదికూడా చదవండి…

