వాహన దారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

వాహన దారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– చిలుక వాగు బ్రిడ్జి పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో పర్యటించారు. వరధ కారణంగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న చిలుక వాగుకు నీరు పోటెత్తింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఈ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులతో పాటు బ్రిడ్జిపై రాకపోకల విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పనులు పూర్తి చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

నగరేశ్వరాలయంలో శ్రావణ సందడి