మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
– తాండూరు బుయ్యని మనోహర్ రెడ్డి
– హస్తం గూటికి చేరిన దొరశెట్టి సత్యమూర్తి
– 100 మంది కార్యకర్తలతో అట్టహాసంగా చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా అందరు సమిష్టిగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు బీఎస్పీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పట్టణంలోని మంతటి పాండయ్య కళ్యాణ మండపంలో సత్యమూర్తి 100 మంది కార్యకర్తలతో కలిసి అట్టహాసంగా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సత్యమూర్తికి, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా చూడాలన్నారు. అదేవిధంగా పార్టీలో చేరిన సత్యమూర్తి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఒకవిధంగా సొంతగూటికి చేరుకున్న ఆనందం కలిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మహిళ అధ్యక్షురాలు గాజుల మాధవి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, వార్డు ఇంచార్జ్ భరత్ రెడ్డి, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

