సీసీ కెమరాలతో గ్రామాల భద్రత
– శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు దోహదం
– కందనెల్లిలో గ్రామస్తులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాలకు పూర్తి భద్రత ఉంటుందని పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ అన్నారు.

గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, డీవీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్‌ల సమక్షంలో గ్రామస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ వేణు కుమార్, పలువురు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటూ కేసుల ఛేదనలో వాటి ప్రాముఖ్యాన్ని ప్రజలకు లోతుగా వివరించారు.

గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలు ఉంటుందని, శాంతి భద్రతలకు, నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

