హిందూ ఉత్సవ సమితికి వన్నె తెస్తా

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితికి వన్నె తెస్తా
– కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్
– సన్మానించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని సమితి ఏకగ్రీవ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
kvcs
హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా రొంపల్లి సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ ను సన్మానించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శాలువా, పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్’ను అభినందించారు.

అనంతరం రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం, వాసవీ మహిళ సంఘం, హిందూ సంఘాలు అందరి సహాకారంతో హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా సమితికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని అన్నారు. అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, సభ్యులు కోడూరు వినోద్ కుమార్, ఆకారపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రక్షా బంధన్‌లో హిందూ వాహిని మార్క్..!