మట్టి వినాయకుడికే జై కొడదాం..!
– ప్రతి ఇంట్లో ప్రతిష్టించి పూజించాలి
– కాగ్నాకు జీవం, పర్యావరణ రక్షణ మన బాధ్యత
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి జై కొడదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఆదివారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లో ఎన్నో ఏళ్లుగా మట్టి వినాయకులను తయారు చేస్తూ విక్రయిస్తున్న కుమ్మరి శంకర్ కుటుంబాన్ని రాజ్ కుమార్ సంఘం నాయకులతో పాటు కలిశారు. కుల వృత్తిలో భాగంగా మట్టి వినాయకులను తయారు చేయడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ కుమ్మరి శంకర్ కుటుంబం వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి వినాయకులను తయారు చేయడం ఆదర్శనీయమన్నారు.

ప్రజలు కూడా ప్రతి ఇంట్లో, వినాయక మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించాలన్నారు. ప్లాస్టర్ పారిస్ లతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్టించి తాండూరు కాగ్నా నది కాలుష్యాన్ని తరిమేసి.. జీవం పొద్దామని అన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్టించే వారు నేరుగా శంకర్ ను సెల్: 9908876875 ద్వారా సంప్రదించాలని సూచించారు. 8 అంగులాల నుంచి 5అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను కొనుగోలు చేయవచ్చన్నారు.

మట్టి వినాయకులను ప్రతిష్ఠించి జై కొడుదామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా నాయకురాలు నర్సమ్మ, మహిళ ఉపాధ్యక్షురాలు మంజుల, పెద్దేముల్ యువజన అధ్యక్షులు నవీన్, బషీరాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ అయ్యా, యువజన అధ్యక్షులు సిద్దార్థ్ గౌడ్. యువజన నాయకులు రాము ముదిరాజ్, వివేక్, కార్తిక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

