రెడ్ అలెర్ట్ పై ఫుల్ అలెర్ట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రెడ్ అలెర్ట్ పై ఫుల్ అలెర్ట్..!
– ప్రజలకు జాగ్రత్తలు సూచించిన జిల్లా కలెక్టర్
– తాండూరు నియోజకవర్గంలో పర్యటన
– జిల్లా ఎస్పీతో కలిసి పలు ప్రాంతాల పరిశీలన
– ఏ ప్రాణనష్టం జరుగకుండా భద్రతలకు చర్యలు
– పంటలు నష్టపోతే పరిహారంపై దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ప్రకటించిన రెడ్ అలెర్ట్ పై ఫుల్ అలెర్ట్ గా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
kvcs
భారీ వర్షాల ప్రకటన నేపథ్యంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లు తాండూరు నియోజకవర్గంలో పొంగు పొర్లుతున్న వాగులు, నదుల పరిసర ప్రాంతాలు, గ్రామాలను సందర్శించారు. కోకట్ సమీపంలోని కాగ్నానదిని సందర్శించారు. పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు పెద్ద పెద్ద భవనాల వద్ద ఉండరాదని, చెట్లు వద్ద కూడా ఉండరాదన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని కావున ప్రజలు బయటకు రావద్దని సూచించారు. రైతులు పశువులను పశుగ్రాసం కోసం బయటకు తీసుకెళ్లరాదన్నారు. వాగులు, నదులు ఉదృతంగా ప్రవహిస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎరైవనా కొట్టుకపోతున్నట్లు, ఏమైనా ప్రమాదం జరిగినా కాపాడేందుకు సిద్ధంగా రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోతే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల ద్వారా సమన్వయం చేసుకుని రక్షణ చర్యలతో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, పలు శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

నీటి గుంతలో వ్యక్తి మృతదేహం..!