ప్రతిశాఖలో అవినీతి రాజ్యం..!
– విద్యుత్, రెవెన్యూ శాఖలో తిమింగలాలు
– మున్సిపల్‌లో ఓ అధికారి తప్పించుకున్నాడు
– బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడి సంచలన వాఖ్యలు
– గతంలో ఓ అధికారిని ఏసీబీ పట్టించిన నాయకడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ శాఖలలో అవినీతి రాజ్యం ఏలుతోందని, ఏ పనిచేయాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఈర్షాద్ ఆవేధన వ్యక్తం చేశారు.

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులలో ఈర్షాద్ కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ సీనీయర్ అసిస్టెంట్ రమేష్ పై తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. పట్టణంలోని 7వ వార్డులో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చిన ఆయన తనకు సంబంధించిన హైదరాబాద్ రోడ్డు మార్గం సర్వే నెంబర్ 26లోని ఓ షెడ్డుకు ఇంటి నెంబర్ కేటాయింపు కోసం రూ.20వేలు డిమాండ్ చేశారని చెప్పారు.

అంత ఇచ్చుకోవడం ఇష్టం లేక ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. మున్సిపల్‌లో అన్ని శాఖల అధికారులు లంచం తీసుకుని పనిచేస్తున్నారని అన్నారు. అందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందన్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారి వెంట ఉన్నతాధికారి ఉన్నారని ఆరోపించారు. అదేవిధంగా విద్యుత్ శాఖలో కూడా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో కూడా అధికారులు లంచాలకు మరిగారని అన్నారు. ఓ అధికారి రేషన్ కార్డుల మంజూరులో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆయనపై జిల్లా కలెక్టర్ కు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈర్షాద్ గతంలో కూడా ఓ అధికారిని ఏసీబీ అధికారులకు పట్టించారు. తాండూరులోని సబ్ రిజిస్ట్రార్ ను ఏసీబీకి పట్టించారు.

ఇదికూడా చదవండి…

