శభాష్.. మధు..!
– మైక్రో ఆర్టిస్టు సన్మానం
– మట్టికుండల గణేష్ తయారిపై ప్రశంసలు
– అభినందించిన హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధును హిందూ ఉత్సవ సమితి శభాష్ అంటూ అభినందించింది. ప్రతి యేడాది వినాయక చవితి సందర్బంగా కొన్నేళ్లుగా మధు పర్యావరణ హిత గణనాథున్ని తయారు చేస్తున్నారు.

ఈ సారి కూడా మట్టి కుండలతో తయారు చేసిన గణనాథుడు తాండూరులోనే ప్రత్యేకంగా నిలిచాడు. పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రతిష్టించిన గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. పర్యావరణ హిత గణేషున్ని తయారు చేసి.. పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతుండడం పట్ల శనివారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మైక్రో ఆర్టిస్ట్ మధును ఘనంగా సన్మానించారు.

వినాయక చవితి ఉత్సవాలలో ప్లాస్టర్ ఫారిస్ వంటి రసాయనాలు వినియోగించకుండా పర్యావరణహిత గణేషున్ని తయారు చేయడం పట్ల శభాష్ అంటూ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో హిందూ ఉత్సవ సమితి తరుపున సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సహ కార్యదర్శి కోట్ల రాజ్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శులు దావులయ్య, దేవగారి రమేష్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకీ, దివిటి ఎల్లప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

