
గణేష్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్..!
– చరిత్ర సృష్టించిన మంచాల ఫ్యామిలి
– నాలుగో సారి కూడా మ్యాజిగ్ ఫిగర్‌తో లడ్డూ సొంతం
– తాండూరులో ఇదే అత్యధిక వేలం ధర
– హైరేంజ్లో కైవసం చేసుకున్న వారు ఎవరెవరంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయకుని లడ్డూకు భలే డిమాండ్ లభించింది. ఆదివారం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఇందులో రికార్డు ధరకు లడ్డూల వేలం జరిగింది. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని పటేల్ భగీచాలోని గణేష్ లడ్డూ రికార్డులు బ్రేక్ చేసే రేటుకు హరాజ్ అయ్యింది. పట్టణంకు చెందిన మంచాల కుటుంబ సభ్యులు అధిక ధరకు వేలం పాడి దక్కించుకున్నారు. మంచాల భాను రేఖ, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు రూ. 4లక్షల 55వేల 555లకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.

గత యేడాది కూడా ఈ కుటుంబ సభ్యులే అదే గణేషుని వద్ద రూ. 4లక్షల 11వేల 111లకు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు నాలుగోసారి లడ్డూ సొంతం చేసుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలో ఇప్పటి వరకు పట్టణంలోని కన్యా పాఠశాల వద్ద గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూ రూ.3లక్షల 1 వెయ్యి 116లు పలికింది. పట్టణానికి చెందిన చెన్మిళ్ల మనిష్ కుమార్ అధిక ధరను పాడి లడ్డూను దక్కించుకున్నారు.

పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూను వరుసగా రెండో యేడాది మార్వాడీ బజార్ కు చెందిన నందకిషోర్ పర్తాని కుటుంబ సభ్యులు రూ. 2లక్షల 52వేలకు కైవసం చేసుకున్నారు. ఈసారి తొలి లడ్డూ వేలంను హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ప్రారంభించారు. పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం వద్ద ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూను ఆయన రూ. 1లక్ష 1,116లకు దక్కించుకున్నారు. పట్టణంలోని పసారి వార్డులో శ్రీ మణికంఠ వినాయక ఉత్సవ సమితి వద్ద రూ. 1లక్ష 40వేలకు లడ్డూ వేలం జరిగింది. ఆదివారం రాత్రి వరకు తాండూరులో లడ్డూల వేలం జరిగింది.

ఇదికూడా చదవండి….

