ఎందుకు అలుసై పోయామో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎందుకు అలుసై పోయామో..!
– డాటా ఎంట్రీ ఆపరేటర్ల ఆవేధన
– చేసిన పనికి డబ్బులు రాక ఊసూరు
– అధికారులు పట్టించుకోక ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికారులకు మేం అలుసై పోయామని పలువురు డేటా ఆపరేటర్లు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేపించుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
kvcs
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా పనిచేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలో అధికారులు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా వివరాలను ఎంట్రీ చేయించారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి సుమారు 60 మందికి పైగా డాటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేశారు. గత డిసెంబర్‌ లో ఆపరేటర్లు పనిచేశారు. ఒక్కో ఎంట్రీకి రూ. 30ల చొప్పున ఒప్పందం చేసుకుని పనులు చేయించుకున్నట్లు ఆపరేటర్లు గుర్తుచేస్తున్నారు.

సమగ్ర కుటుంబాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయడం జరిగిందని, రాత్రి పగలు తేడాలేకుండా పనిచేశామని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. చేసిన పనికి డబ్బులు ఇప్పించాలని ఓ ఉన్నతాధికారిని కోరితే ఇప్పుడు తాను ఇంచార్జ్ గా లేనని, తనను అడగొద్దని చెప్పినట్లు ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. చేసిన పనికి డబ్బులు ఇప్పించాలని ప్రతి రోజూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఎంతో బాధ్యతగా పనిచేసినా అధికారులకు మేం అలుసు అయి పోయామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆపరేటర్లకు రావాల్సిన డబ్బులు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

షాడో.. కాదు.. సేవకుడు..!