యూరియా రైతుల అరిగోస..!
– తెల్లవారు ముందే బారులు
– తాండూరు మనగ్రోమోర్ వద్ద ఉద్రిక్తత
– పత్తాలేకుండా పోయినా యజమాని
– ఎప్పుడొస్తాడో అని రైతుల ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రైతుల యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు అరిగోసలు పడుతున్నారు.

తెల్లవారు జామునే ఫర్టిలైజర్ దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన గ్రోమోర్ కేంద్రాలకు రైతులు పొటెత్తారు. తెల్లవారు జాము 5 గంటలకే వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బారులు తీరారు. దాదాపు 1000 మందికి పైగా క్యూలో నిలుచున్నారు. వృద్ధులు, మహిళలు, యువరైతులు వరుసలో నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులను కదలిస్తే వారి కష్టాలు వెలిబుచ్చుకున్నారు.

పంటలను కాపాడేందుకునేందుకు కష్టాలు పడుతున్నామని అన్నారు. ఒక్క బస్తా అయితే దొరుకుతుందేమా అని తంటాలు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మనో గ్రోమోర్ యజమాని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో వచ్చి మళ్లీ వెళ్లిపోయారని అన్నారు. మళ్లీ వస్తారో రారో అని అయోమయం వ్యక్తం చేశారు. సోమవారం 7గంటలకే తెరిచిన వ్యాపారి.. ఈ రోజు 9గంటలైనా రాలేదని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

