రెండు రోజులు వర్ష సూచన..!
– ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించారు.

ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రం అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో జోరువాన కురవడంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా్ల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ.

ఇదికూడా చదవండి….

