ఎస్‌ఐ విఠల్ రెడ్డి గ్రేట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్‌ఐ విఠల్ రెడ్డి గ్రేట్..!
– విధిలో చాటుకున్న మానవత్వం
– వాగులో నుంచి మృతదేహం వెలికితీత
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి విధుల్లో మానవత్వం చాటుకుని గ్రేట్ అనిపించుకున్నారు. వాగులో గల్లంతు అయిన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసి ధీరత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. యాలాల మండలంలోని విశ్వనాథ్‌ పూర్ గ్రామ సమీపంలోని కాక్రవేణిలో ఆదివారం ఓ యువకుడు గల్లంతు అయ్యాడు. మృతదేహాం కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం వాగులో యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది.
kvcs
సమాచారం అందుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాగులోకి దిగారు. యువకుడి మృతదేహానికి తాళ్లు కట్టి.. ఒడ్డుకు స్వయంగా లాగుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాలు స్థానికులు గమనించి ఆన్ డ్యూటీలో ఎస్ఐ అందిస్తున్న సేవలు, మానవత్వానికి ఫిదా అయ్యారు. ఎస్ఐ విఠల్ రెడ్డి మృదేహాన్ని బయటకు తీసుకవచ్చేందుకు అందించిన సాయానికి అభినందనలు తెలిపారు. మరోవైపు వాగులో గల్లంతు అయి మృతి చెందిన యువకుడు యాలాల మండల కేంద్రానికి చెందిన యువకుడుగా అనుమానిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదికూడ చదవండి…

వాహనదారులకు షాకింగ్ న్యూస్..!