జేబీ హాస్పిటల్లో న్యూరో క్యాంపు..!
– స్పెషలిస్ట్ డా.సౌమ్యరెడ్డితో వైద్య సేవలు
– వెన్నెముక, మెదడు సమస్యలపై వైద్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జేబీ హస్పిటల్లో స్పెషల్ న్యూరో క్యాంపు నిర్వహిస్తున్నట్లు హస్పిటల్ ప్రతినిధులు తెలిపారు.

శుక్రవారం(ఈరోజు) మధ్యాహ్నం 12-30గంటల నుంచి 3-30గంటల వరకు న్యూరో సమస్యలపై వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్లోని రెనోవా నీలిమ హాస్పిటల్కు చెందిన న్యూరో స్పెషలిస్ట్ డా. ఏ. సౌమ్యరెడ్డి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. మొదడు, వెన్నెముక, తలకు గాయాలు, మూర్చ్య వంటి సమస్యలను పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఇంకా మరెన్నో న్యూరో సమస్యలపై వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్: 8008074489, 9553320906లకు సంప్రదించాలన్నారు. ప్రతినెల 2వ, 4వ శుక్రవాలలో న్యూరో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని తాండూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
క్యాంపులో అందుబాటులో ఉన్న మరిన్ని వైద్య సేవలు


ఇదికూడా చదవండి…

