బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్‌ ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్‌ ధ్యేయం..!
– రిజర్వేషన్ల అములపై వెనుకడుగు ప్రసక్తే లేదు
– ద్రోహులుగా బీఆర్ఎస్, బీజేపీలు నిలవడం ఖాయం
– తాండూరు కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు(ఎల్ఎన్ఆర్)
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తాండూరు కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు(ఎల్ఎన్ఆర్) అన్నారు.

శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలుపై హై కోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయం వల్ల బీసీల నోటికాడి కూడును లాగేసుకున్నట్లుగా మారిందని అన్నారు. అయితే బీసీల రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు.
kvcs
ఈ రెండు పార్టీలు ఇంప్లీడ్ పిటిషన్ వేయకపోవడమే వారి చిత్త శుద్దిని తెలియజేస్తుందని అన్నారు. బీజేపీతో కుమ్మక్క బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీసీల ద్రోహులుగా నిలిచిపోవడం ఖాయమన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పార్టీ అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. బీసీలు నిరాశకు గురికావద్దని అన్నారు.

ఇదికూడా చదవండి…

ఆక్రమణలపై కొరడా..!