మీ ఫ్యాక్టరీని మూసేయిస్తా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మీ ఫ్యాక్టరీని మూసేయిస్తా..!
– చెట్టినాడ్‌పై ఎంపీ కొండా ఫైర్
– బాధితులకు వారంలో పరిహారం ఇవ్వాలి
– కర్మాగారం ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్
– సంగెంకలాన్ లో పర్యటించిన విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పైసలు సంపాదించేందుకు పేదల జీవితాలు నాశనం చేస్తారా.. సిగ్గుందా..? మీ.. ఫ్యాక్టరీ మూయిస్తా.. అంటూ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఊగిపోయారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో వరధ పోటెత్తింది. వరధ నీరు వల్ల పంటలు నాశనం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

గ్రామ సమీపంలోని చెట్టినాడు బ్రిడ్జివల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు రైల్వే ట్రాక్ పై ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి చేరడంతో మంగళవారం ఆయన సంగెంకలాన్ గ్రామాన్ని సందర్శించారు. పార్టీ నాయకులతో కలిసి, గ్రామస్తులతో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. వరధ కష్టాలు, పాడైన పంటల వివరాలను తెలుసుకున్నారు. చెట్టినాడ్ కర్మాగారం ప్రతినిధులతో కలిసి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యజమానులు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే వరధ కష్టాలు ఎదురయ్యాయని అన్నారు. 18 పిల్లర్లకు 3 నిర్మించడంపై అగ్రహం వ్యక్తం చేశారు.
kvcs
నష్టపోయిన గ్రామస్తులకు. రైతులకు పరిహారం ఫ్యాక్టరీ నుంచి ఇప్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో నో ఎక్స్ క్యూజీవ్ అంటూ ఫైర్ అయ్యారు. మీ ఫ్యాక్టరీ వల్ల నష్టం జరిగితే పరిహారం ఇవ్వరా అంటూ మండిపడ్డారు. సిమెంట్ అమ్ముకుని ఫైసల్ సంపాదిస్తారా.. పరిహారం అడిగితే పట్టించుకోరా అంటూ ఊగిపోయారు. ఫ్యాక్టరీ నుంచి నష్టపోయిన బాధితులకు పరిహారం ఇచ్చితీరాలన్నారు. వెంటనే ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. వారం రోజుల్లో బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఫ్యాక్టరీని మూయించి వేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులకు, రైతులకు మీకు న్యాయం చేసేలా చూస్తామని భరోసా అందించారు. ఎంపీ వెంట జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లాప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..!