వేటకు వెళ్లిన వ్యక్తి మృతి..!
– విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వేటకు వెల్లిన ఓ వ్యక్తి పంటలను కాపాడుకునేందుకు బిగించిన కరెంటు వైర్లకు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

యాలాల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్(35) ఈనెల 9న అదే గ్రామానికి పెట్యానాయక్ తో కలిసి ఇంటి నుంచి వేటకు వెళుతున్నాని చెప్పి బయల్దేరాడు. మరుసటి రోజు రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో సోమవారం యాలాల పోలీసులకు అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. అయితే మంగళవారం యాలాల మండలం బాణాపూర్ గ్రామం సర్వేనెంబర్ 52లో నీరటీ శాకప్ప, నీరటి రాజు పొలాల వల్ల మృతదేహం కనిపించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతి చెందింది శేఖర్ గా గుర్తించారు. నీరటీ శాకప్ప, నీరటి రాజు పొలాలను కాపాడుకునేందుకు బిగించిన విద్యుత్ వైర్లకు తగిలి శేఖర్ మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. వ్యక్తి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

