ముప్పు రాకుండా ముందు జాగ్రతపడదాం
– సంపూర్ణ వ్యాక్సీనేషన్‌కు అందరు సహకారం
– ఓమిక్రాన్ నియంత్రణకు నిబంధనలు తప్పనిసరి
– తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా మూడో దశ, ఓమిక్రాన్ వైరస్ ముప్పు రాకుండా అందరం ముందు జాగ్రత్త పడదామని, ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించరించాలని తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ అన్నారు. శనివారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కొత్త భవనంలో కౌన్సిలర్లు, అధికారులతో సంపూర్ణ వ్యాక్సీనేషన్, ఓమిక్రామ్ ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు.
18 ఏండ్ల నిండిన వారంతా వ్యాక్సీనేషన్ వేసుకునేలా ప్రజలను చైతన్య పరచరాలన్నారు. వ్యాక్సీనేషన్‌పై అపోహలు వీడేలా అవగాహన కల్పించాలన్నారు. తాండూరు పట్టణంలో సంపూర్ణ వ్యాక్సీనేషన్ జరిగేలా సహకరించాలన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ రాకముందే ముందు జాగ్రత్తగా పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, ఎంఐఎం కౌన్సిలర్ బోంబీనా, కోఆప్షన్ సభ్యులు, పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్, మున్సిపల్ డీఈ రంగనాథం, మేనేజర్ బుచ్చిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
