అందరు స్వచ్ఛతను కొసాగించాలి
– స్వచ్ఛదనం – పచ్చదనంలో కార్మికుల పాత్రకీలకం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛతను పాటిస్తూ.. పచ్చదనం పెంపుకు అందరు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 28వ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 5 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం – పచ్చదనం ముగింపు కార్యక్రమం వార్డు కౌన్సిలర్ విజయదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో సేవలందించిన వార్డు ఆఫీసర్ గోపాల్, జవాన్ శ్రీనివాస్, వీరణ్ణ, ఆర్పీ, సిబ్బందిని సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం చేపట్టిందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తితో నిరంతరం పాటించాలని సూచించారు. అదేవిధంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో అధికారులు, జవాన్లు, కార్మికులు అందించిన సేవలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

