రిజర్వేషన్లు బీసీల హక్కు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రిజర్వేషన్లు బీసీల హక్కు..!
– తాండూరులో వెలువెత్తిన నిరసనలు
– 42శాతం అమలు చేసి తీరాలి
– బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– భారీగా తరలివచ్చిన రాజకీయ, కుల సంఘాల నాయకులు
– బంద్ తో డీపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పొందే హక్కు బీసీలకే ఉందని పలువురు రాజకీయ పార్టీ, సంఘాల, యూనియన్ల నాయకులు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీ సీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ తాండూరులో సంపూర్ణమైంది.

బీసీ జేఏసీ నాయకులు కందుకూరి రాజ్ కుమార్, ఈడిగి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో పాటు పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. బీసీ సంఘంతో పాటు అన్నీ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చస్తారు. ర్యాలీ, నిరసన కార్యక్రమాలలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటూ అనుకూలంగా నినాదాలు చేశారు. పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసివేయించారు. అనంతరం పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
kvcs
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది న్యాయమైన హక్కుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ వారు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. బీసీలు కూడా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రాజుగౌడ్, నాయకులు డా. సంపత్ కుమార్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ నాయకులు పట్లోల్ల నర్సింలు, శ్రీనివా స్ చారి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, నాగారం మల్లేశం. సుదర్శన్ గౌడ్, టీజేఎస్ ఇంచార్జ్ సోమ శేఖర్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు గాజుల మాధవి, నాయకులు బంటు మల్లప్ప, కావలి సంతోష్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, బీసీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ బంద్ లో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

బంద్ సంపూర్ణం..
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ తాండూరులో సంపూర్ణమైంది. బంద్ సందర్భంగా తాండూరులోని ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్ బోసి పోయింది. బస్సులు నడవకపోవడంతో పండగ కోసం గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు బీసీ బంద్ సందర్భంగా పట్టణంలోని పలు వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. పలు పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వివిధ వ్యాపార దుకాణాలు తెరుచుకోలేదు. ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలకు జరగకుండా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

ఇదికూడా చదవండి…

బంద్‌లో యూత్ శక్తిని చాటుతాం..!