తాండూరు రూరల్ సీఐపై బదిలీ వేటు..!
– కొత్త సీఐగా ప్రవీణ్ కుమార్ రెడ్డి నియామకం
– బాధ్యతల స్వీకరణ కూడా పూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ సీఐ నగేష్‌పై బదిలీ వేటు పడింది.

ఆయన స్థానంలో కొత్త సీఐగా ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా రూరల్ సీఐ నగేష్ బదిలీ అవుతారని ప్రచారం జరిగింది.

ఇటీవలే తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయగా రూరల్ సీఐ నగేష్ ను కూడా ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం చకచకా రూరల్ సీఐ నగేష్ బదిలీ కావడం.. ఐజీ కార్యాలయంలో వెయింటింగ్‌లో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి.

ఇదికూడా చదవండి…

