కాంగ్రెస్ గూటికి చేరిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ గూటికి చేరిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
– ఎమ్మెల్యే సమక్షంలో కండువా వేసుకున్న సాజిద్ అలీ
– కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు,దర్శిని ప్రతినిధి : తాండూరు ఎంఐఎం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం నేత సయ్యద్ సాజిద్ అలీ కాంగ్రెస్ గూటికి చేరారు.

మంగళవారం హైదరాబాద్ లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాజిద్ అలీని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

అదేవిధంగా సాజిద్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై పార్టిలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు హబీబ్ లాల, ఉప్పరి మల్లేశం, కొమ్ము గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సాజిద్ అలీ ఎంఐఎం పార్టీలో సాజిద్ అలీ కీలకంగా పనిచేశారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఎంఐఎం పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టిలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

రోడ్లపై వ్యాపారాలు చేయొద్దు..!