మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత

తాండూరు రాజకీయం వికారాబాద్

మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత
– జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జయంతిలకు తోడ్పాటు
– తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గ దళిత, ప్రజా సంఘాల నాయకులు విఠల్ నాయక్ ను కలిశారు. 11న మహాత్మ జ్యోతిరావు పూలే, 14న భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిల జయప్రదానికి సహకారం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాడిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, డా. బీఆర్ అంబేద్కర్ లు అని కొనియాడారు. అందరికి విద్య అందించడంతో పాటు అంటరాని తనం నిర్మూళనకు జ్యోతిరావు పూలే చేసిన కృషిని గుర్తుచేశారు. అదేవిధంగా సమాజంలో అందరికి సమానంగా ఓటు హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తన వంతు సహాకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కె. శ్రీనివాస్, వై. రాములు, మెట్లి ఆశన్న, బుగ్గప్ప, నర్సింలు. చంద్రయ్య, మల్లికార్జున్, రఘుపతి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

ఒక్క క్లిక్‌ చాలు..!