రోడ్లపై వ్యాపారాలు చేయొద్దు..!
– ట్రాఫిక్ ఆటంకాలు కలిగిస్తే చర్యలు
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– ట్రాపిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారులు, ప్రజలు రోడ్లపై వ్యాపారాలు చేయొద్దని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు.

మంగళవారం తాండూరు పోలీసు, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమీషనర్ యాదగిరిలు కలిసి వ్యాపారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారులు రోడ్లపై ఆక్రమణలకు పాల్పడరాదన్నారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయరాదన్నారు. రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ కు ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ట్రాఫిక్ కు సహకరించడం అందరి బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ ఆటంకం కలిగించినా.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

