ఖాంజాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఖాంజాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..!
– గ్రామం గురించి అన్నీ తెలిసిన పెరుమాళ్ల రాంరెడ్డిని గెలిపించండి
– ఖాoజాపూర్ ప్రచారంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఖాంజాపూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బియ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం ఖాoజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థి పెరుమాళ్ల రాంరెడ్డికి మద్దతుగా గ్రామంలో ప్రచారం చేశారు. 40 ఏళ్లుగా రాంరెడ్డి గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేశారు. పెరుమాళ్ల రాoరెడ్డిని సర్పంచ్ గా గెలిపించుకుంటే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. చిన్న గ్రామంలో చింతలు లేకుండా ఉండాలంటే గ్రామం పై పట్టుదల ఉన్న పెరుమాళ్ల రాంరెడ్డి గెలుపుకు కత్తెర గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

యువత తప్పుడు మార్గంలో పోకుండా మంచితనం, మానవత్వం, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయగల సత్తా ఉన్న పెరుమాళ్ల రాంరెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాంరెడ్డి, పంజుగుల నర్సింలు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హామి ఇచ్చారు.. ఆదమరవకండి..!