హామి ఇచ్చారు.. ఆదమరవకండి..!
– రాయల్ కాంట రోడ్డును వెంటనే ప్రారంభించాలి
– కమీషనర్ కు బీఆర్ఎస్ నేత ఈర్షాద్ విజ్ఞప్తి
తాండూరు, దర్శని ప్రతినిధి : రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ నేత ఈర్షాద్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు.

గత 21 రోజుల క్రితం తాండూరు పట్టణం 15వ వార్డు రాయల్ కాంట సమీపంలో రోడ్డు వేయాలని నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈర్షాద్, నేతలతో కలిసి కాలనీ వాసులుకు మద్దతు తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యే అదేశాలతో నెల రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు హామి ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించుకున్నారు. 21 రోజులు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు.

ఈ విషయమై శనివారం బీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్ మున్సిపల్ కమీషనర్ యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాయల్ కాంట సమీపంలో రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు, వృద్ధులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురో ్కంటున్నారని కమీషనర్ కు వివరించారు. ఇచ్చిన హామి మేరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. రోడ్డు పనులుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించాలని అన్నారు. లేదంటే మరో ఆందోళన తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

