గులాబీ.. గుభాళింపు..!
– పైలెట్ నివాసంలో కొత్త సర్పంచుల సందడి
– సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రోహిత్ రెడ్డి
– ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన రాకపోకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో గులాబీ రంగు గుభాళించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మద్దతు దారులు రోహిత్ రెడ్డి ఇంటి బాట పట్టారు.

కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ఉదయం నుంచి సందడి మొదలైతే.. రాత్రి వరకు కొనసాగింది. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మరియు పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలువగా వారందరికి శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించారు.

బషీరాబాద్ మండలం పర్వతపల్లి, కుప్పనకోట్, కొర్విచేడ్, కొర్విచేడ్ గని, మల్కన్ గిరి, దామర్ చేడ్, కోత్లాపూర్, క్యాద్గిరా, ఇందరచెడ్, గంగ్వార్, అల్లాపూర్, కమసానపల్లి(M), నవల్గా, గొటిగాకలాన్, మంతటి, కుప్పనకోట్, నీళ్లపల్లి, జమ్లానాయక్ తాండా, నంద్యానాయక్ తాండా, తాండూరు మండలం కోటబాసుపల్లి, మిట్టబాసుపల్లి, చింతామణిపట్నం, జిన్గుర్తి, కొత్లాపూర్, సంగెంకలాన్, సిరిగిరిపేట్, పర్వతాపూర్, బెల్కటూర్, అల్లాపూర్, యాలాల మండలంలోని ఎన్కేపల్లి, పేర్కంపల్లి, దౌలాపూర్, రాఘవాపూర్, నాగసముందర్, దేవనూర్, గోరెపల్లి, పేర్కంపల్లి తాండా, ముకుందాపూర్, పెద్దేముల్ మండలంలోని రుక్మాపూర్, పాషాపూర్, ఊరెంటితాండా, ఎర్రగడ్డతాండా, బుద్ధారం, బాయిమీది తాండా, మంబాపూర్ సర్పంచులతో పాటు పలువురు ఉపసర్పంచులు కలిశారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి కొత్త సర్పంచులు అంతా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వచ్చే జెడ్పీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని గ్రామాల అభివృద్ధికి నిధుల వరధ పారిస్తామని భరోసా అందించారు. మరోవైపు ఇంటికి వచ్చిన నేతలకు, కార్యకర్తలకు భోజనం సదుపాయం కల్పించారు. ఉదయం నుంచి గులాబీ నేతల సందర్శనలతో బీఆర్ఎస్ క్రేజ్ తగ్గలేదని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

