సల్లంగా చూడూ రేణుకా ఎల్లమ్మ తల్లీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సల్లంగా చూడూ రేణుకా ఎల్లమ్మ తల్లీ..!
– అమ్మవారిని దర్శించుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించిన ఉత్సవ కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ అంటూ తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వేడుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి.

ఇందులో భాగంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్‌ రెడ్డి తాండూరు ప్రజలను సల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు.

గంజ్ వ్యాపారులు, కార్మికులందరిపై చల్లని కృప చూపాలని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం జాతర ఉత్సవ కమిటి సభ్యులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్, దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్, పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, గంజ్ హమాలి కార్మికులు, గుమస్తాలు, భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఓర్వలేని రాజకీయాలు మానుకోండి..!