నేతాజీలో ఘనంగా గణిత దినోత్సవం
– అంకెల ఆకారంలో ఆకట్టుకున్న విద్యార్థులు
– అబ్బుర పరిచిన విద్యార్థుల గణిత ప్రదర్శన
– అభినందించిన స్కూల్ డైరెక్టర్ మణిమాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం గణిత పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు అంకెలతో ప్రదర్శనలు ఇచ్చారు. ఆచార్య, రామానుజన్ తదితర మహాభావుల వేషాధారణలో ఆకట్టుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో గణిత సూత్రాలు, ఆకృతులతో ఇచ్చిన ప్రదర్శనలు అబ్బుర పరిచాయి. విద్యార్థుల ప్రదర్శనలతో పాఠశాలలో సందడి ఏర్పడింది.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలు విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థుల ప్రదర్శనలు మెచ్చుకుని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణిత దినోత్సవ విశిష్ఠతను తెలిపారు. విద్యార్థులు గణితం అంటే భయపరాదన్నారు. ఇష్టంతో చదివితే సులువుగా ఉంటుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

