దాతల సాయం స్మరణీయం
– శబరిమల పాదయాత్ర దాతలకు సన్మానం
– కృతజ్ఞతలు తెలిపిన వరాల శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యంత కఠినమైన శబరిమల పాదయాత్రకు దాతలు అందించిన సాయం స్మరణీయమని తాండూరు అయ్యప్ప స్వామి భక్తుడు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఇటీవల సువర్ణ భూమి ఆశ్రమం గురు వినయ్ కుమార్, గురు వసంత్ కుమార్ ల ఆధ్వర్యంలో తాండూరు నుంచి శబరిమలకు చేపట్టిన యాత్రకు స్థానిక దాతలు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వాముల పాదయాత్రకు రూ.50వేలు అందించిన డా. సంపత్ కుమార్, రూ.10వేలు అందించిన డా. అనిల్ కుమార్ రెడ్డి, రూ. 20వేలు అందించిన డా. వివేక్ శ్రీకర్, రూ.11 వేలు అందించిన నాపరాతి వ్యాపారి బసవరాజ్, డీజే కోసం రూ. 18 వేలు అందించిన నారాయణ రాథోడ్,

మధ్యాహ్న భోజనంకు సహకరించిన నాపరాతి వ్యాపారి పుట్ట నర్సింలు గౌడ్, గజానన బేకరీ యజమాని రుద్రుపాటిల్, రూ. 10వేలతో డీఎసీంలో ఫామ్ ఏర్పాటు చేసి సహాకారం అందించిన దాతలను వరాల శ్రీనివాస్ రెడ్డి కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. పాదయాత్రకు సహాకారం అందించిన దాతలకు అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించారు. దాతలు అందించిన సహాకారం స్మరణీయమని కొనియాడారు.

ఇదికూడా చదవండి…

