మిద్దె తోటకు 50వసంతాలు..!
– మంతటి శంకరమ్మ కృషి అభినందనీయం
– వార్షికోత్సవంలో పలువురు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మిద్దె తోటకు 50వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన మంతటి శంకరమ్మ, మంతటి సంగమేశ్వర్ లు వారి ఇంటిపై మిద్దె తోట నిర్వహిస్తున్నారు.

ఈ మిద్దె తోట సాగు 50 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం విశేషం. దీనికి శంకరి గార్డెన్ అని నామకరణం చేశారు. ఈ తోట 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఆదివారం వారి నివాసంలో 50వసంతాల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డా. సుధారాణి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యతో పాటు పలువురు ఆర్యవైశ్య, ఆర్యవైశ్య మహిళ సంఘం సభ్యులు హాజరై మంతటి శంకమ్మ, సంగమేశ్వర్ దంపతులను సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇంటిపైనే మిద్దె తోట ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. 50 ఏండ్లుగా మిద్దె తోట నిర్వహించడమే కాకుండా సేంద్రీయ పద్ధతిలో పూలు, కూరగాయాలు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టడం అభినందనీయని కొనియాడారు. శంకరమ్మ, సంగమేశ్వర్ దంపతులను ఘనంగా సన్మానించారు.

అనంతరం శంకరమ్మ మాట్లాడుతూ తన తండ్రి స్పూర్తితో మిద్దె తోట ప్రారంభించడం జరిగిందని, తన భర్త సంగమేశ్వర్ కూడా తోడ్పాటు అందించారని అన్నారు. మిద్దె తోట ద్వారా సేంద్రీయ పద్ధతిలో పూల మొక్కలతో పాటు కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టకం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

ఇదికూడా చదవండి…

