జూనియర్ కాలేజీ ఆధునీకరణకు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

జూనియర్ కాలేజీ ఆధునీకరణకు కృషి
-విద్యాశాఖ మంత్రి సహాకారంతో అభివృద్ధి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– సమస్యలపై మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే
-ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధునీకరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి * పేర్కొన్నారు. శనివారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థులతో కలిసి కళాశాల సమస్యలపై ఆరా తీశారు.
అయితే కళాశాలలో 24 తరగతి గదులు ఉండగా మాత్రమే 8 గదులు పురాతమైనవి ఉన్నాయని గుర్తించారు. ప్రహారి. సమస్య ఉందని తెలుసుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాలేజీలో 2500 విద్యార్థులు ఉండ‌గా తర‌గ‌తి గ‌దుల్లో కూర్చోలేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. సమస్యల‌ను వివరించిన వెంటనే మంత్రి సబితా రెడ్డి స్పందించి.. కళాశాలలో గదులు, ఇతర సమస్యలపై పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డీఎంఎఫ్టీ నిధులు మంజూరుకు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి సహాకారంతో తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధునీకరణకు కృషి చేస్తామన్నారు.

విద్యార్థుల కోసం మౌళిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల సౌక‌ర్యార్థం గ‌దులను నిర్మిస్తామ‌న్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (న‌యూం), నాయకులు పట్లోళ్ల‌ నర్సింలు, కౌన్సిలర్లు, యువకులు తదితరులు ఉన్నారు.

విద్యార్థి విడియోకు స్పందించిన ఎమ్మెల్యే
మ‌రోవైపు జూనియ‌ర్ క‌ళాశాల‌కు చెందిన ఓ విద్యార్థి చేసిన విడియో పోస్టుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. క‌ళాశాల‌కు చెందిన ఓ విద్యార్థి కాలేజీలో త‌ర‌గ‌తి గ‌దులు స‌క్ర‌మంగా లేక ఇబ్బందు ప‌డుతు ఇరుకు గ‌దుల్లో కూర్చున్న‌ట్లు ఎమ్మెల్యేకు విడియో సెండ్ చేశాడు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంట‌నే నేరుగా క‌ళాశాల‌కు చేరుకుని విద్యార్థుల‌తో క‌లిసి మాట్లాడారు. స‌మ‌స్య‌ను వెంట‌నే మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారానికి చొర‌వ చూప‌డంతో విద్యార్థులు సంతోషం వ్య‌క్తం చేశారు.