వైకుంఠ దర్శనానికి వెళదాం.. రండి..!
– ముస్తాబైన దస్తగిరి వెంకటేశ్వర దేవాలయం
– భక్తులకు రద్దీలేకుండా ఏర్పాట్లు
– ఉత్తర ద్వార దర్శన సమయం ఇదే
తాండూరు, దర్శిని ప్రతినిధి : పురాణాలలో వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తారని ఆ పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజున ఉత్తరద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతటి విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి కోసం రేపు తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరి(చంద్రగిరి)పేట్లో వెలసిన శ్రీదేవి, భూదేవి, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాట్లు చేశారు. ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయంలో భక్తులకు ఉత్తరద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

అదేవిధంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయంలో స్వామి వార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 4-30లకు స్వామి వార్లకు మేలుకొలుపు 5 గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనంకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు 31న ముక్కోటి ద్వాదశి కూడా నిర్వహిస్తున్నారు. అదేరోజు ఉదయం 4-30గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు ప్రత్యేక పూజా, తీర్థ ప్రసాద వితరణలు చేయడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త, అర్చకులు, కమిటి సభ్యులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

