అసంబద్ధంగా మున్సిపల్ ఓటర్ల జాబితా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అసంబద్ధంగా మున్సిపల్ ఓటర్ల జాబితా..!
– ఫోటోలు లేక గుర్తింపులో ఇబ్బందులు
– 20వ వార్డులో నకిలీ ఓటర్ల నమోదును తొలగించాలి
– అధికారులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా పూర్తిగా అసంబద్ధంగా రూపొందించారని కాంగ్రెస్ యువకులు బిడ్కర్ రఘు ఆరోపించారు.
శనివారం మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 36వ వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో ఓటర్లకు సంబంధించిన ఫోటోలు ప్రచురించలేదని తెలిపారు. దీనివల్ల వార్డుల్లో ఉన్న ఓటర్ల గుర్తింపుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.

అసలు ఓటర్లు ఎవరో.. నకిలీ ఓటర్లు ఎవతో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కావున ఫోటోలతో కూడిన ఓటరు జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పట్టణంలోని 20వ వార్డులో కొత్తగా నకిలీ ఓటర్లు నమోదు చేయబడ్డారని తెలిపారు. చనిపోయిన వ్యక్తుల వివరాలు కూడా ఓటరు జాబితాలో ఉన్నాయని తెలిపారు. 20వ వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లు ఉన్నారని తెలిపారు. అధికారులు ప్రకటించిన జాబితాలో సుమారు 300లకు పైగా ఓటర్లు అక్రమంగా ఉన్నారని తెలిపారు. పూర్తిగా ఈప్రక్రియ అసంబద్ధంగా జరిగిందని అన్నారు. కావున ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు పునీత్ కూడా ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..!