బల్దియా పీఠం బీఆర్ఎస్దే..!
– 34వ వార్డులో గులాబీ గెలుపు ఖాయం
– బీఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి.. చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు కరుణాకర్ అన్నారు.

పంచాయతి ఎన్నికల స్పూర్తితో మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని 34వ వార్డులో గులాబీ గెలుపు ఖాయమని అన్నారు. రోహిత్ రెడ్డి సహాకారంతో వార్డులో పోటీ చేస్తానని తెలిపారు. స్థానిక ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

