గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు
– సమాధికి పూలమాల వేసిన నర్సింహారెడ్డి(బాబు)
– కోటబాస్పల్లిలో వర్థంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాండూరు సీటీకేబుల్ ఎండీ, స్వర్గీయ మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నర్సింహారెడ్డి(బాబు) తల్లి గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు అర్పించారు.

బుధవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ 9వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి హాజరై మహిపాల్ రెడ్డి స్మృతి వనంలో తల్లి కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ సమాధికి నర్సింహారెడ్డి తన సతీమణి సుస్మితారెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోటబాస్పల్లి లోని గట్టిగా నర్సింహారెడ్డి బాబన్న తన నివాసానికి చేరుకొని తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గొట్టిగ రామ్ రెడ్డి, గొట్టిగ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, కిష్టప్ప, బోయిని జగదీష్, కరణం చందు, గుర్రంపల్లి మధు,బురానుద్దీన్, బాలరాజు, మాశప్ప, బాలకృష్ణ, చాకలి నరసింహులు, జంగం సాయి, మాల సురేష్. చాకలి విజయ్, భరత్, బోయిని విగ్నేష్,బోయిని నవీన్, గౌసోద్దీన్, CH. అశోక్, కొండన్ రవి, శ్రీనివాస్, చాకలి శేఖర్, మాల అంజిలప్ప, మ్యాతారి నర్సింలు, బోయిని జగదీష్, తలారి వెంకట్, విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాల రామప్ప, భరత్. ఎండి ఇర్ఫాన్, తెజుద్దీన్, చాకలి శేఖర్, తలారి నరసింహులు, దాసరి సాయప్ప, దేవనూరు నర్సింలు, వడ్డే హనుమంతు, చాకలి నరేష్, వడ్డే ప్రకాష్, వడ్డే ఎల్లప్ప, వడ్డే గణేష్, చాకలి నవీన్, దర్జీ రాజు, ఎండి బాబు, పి.రవి, జిన్గుర్తి గోపాల్, మాల మంకలప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

