వచ్చే ఐదేళ్లలో అన్ని సమస్యలు తీరుస్తా..!
– అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
– 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : 24వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో అన్ని సమస్యలు తీరుస్తానని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్త మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, భర్త కోట్రిక శ్రీకాంత్, బీఆర్ఎ స్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలుతో కలిసి 24వ వార్డులో ఉదయం, రాత్రి ముమ్ముర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే 24వ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందరికి 24గంటలు అందుబాటులోకి ఉండి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిలలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

