రాజకీయంగా బీసీలు ప్రత్యేకంగా నిలవాలి
– ఈనెల 23న జిల్లా బీసీ సర్పంచులకు సన్మానం
– సన్నాహాక సమావేశంలో బీసీ సంఘం జిల్లా నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాలలో బీసీలు ప్రత్యేకంగా నిలవాలని బీసీ సంఘం జిల్లా నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ లు అన్నారు.

మంగళవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బీసీల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు గుడిసె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ తదితరులు హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వికారాబాద్ జిల్లాలోని సర్పంచులందరికి పార్టీలకతీతంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశానికి తాండూరు నియోజకవర్గం నుంచి కూడా బీసీ సర్పంచులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రాజకీయాల్లో బీసీలు ప్రత్యేకంగా నిలవాలని అన్నారు. ఐక్యమత్యం చాటుకుని రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలని అన్నారు. 23న జరిగే బీసీల జిల్లా సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మాజీ ఎంపీపీ నర్సింలు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పండుగౌడ్, జిల్లా బీసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్, సీనీయర్ జర్నలిస్ట్ శెట్టి రవి, న్యాయవాది కె. గోపాల్, నాగారం మల్లేశం, మంతన్ గౌడ్ రాజు, వడ్డెర సంఘం నాయకులు సత్యనారాయణ, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, అరుణ్ రాజ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు వీరప్ప, మండల అధ్యక్షులు నరేందర్, బసంత్ కుమార్, ఏలేటి శ్రీనివాస్, సర్పంచ్ భార్గవి, నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మీ, శ్రీశైలం, ప్రభు శంకర్, రాము ముదిరాజ్, దుబాయ్ వెంకట్, పరమేష్, గోపాల్, టైలర్ రమేష్, అనిల్, రాహుల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

