ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం
– ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం
– ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ శ్రీలత
– తాండూరు డీపోలో భద్రతా మాసోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపడంలో డ్రైవర్లు, కండక్టర్లదే కీలక పాత్ర అని ఆ శాఖ రీజీనల్ మేనేజర్ శ్రీలత అన్నారు. ఆర్టీసీ భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తాండూరు ఆర్టీసీ డీపోలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రీజీనల్ మేనేజర్ శ్రీలత తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, డీప్యూటీ డీఆర్ఎం సరస్వతి, ఏఎంవీఐ అరుణ్ కుమార్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు, కండక్టర్ల కృషి అభినందనీయమన్నారు. సంస్థను ప్రగతి పథంలో నడిపించడంలో వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆర్టీ సీలో డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రయాణికులను తరలించే డ్రైవర్లకు ప్రతి రోజూ విధులపై అవగాహ కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విధులకు వెళ్లే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఆర్టీసీ డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ద వహించి.. విధుల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. భద్రతా మాసోత్సవాల సందర్భంగా తాండూరు. పరిగి, వికారాబాద్ డీపోలకు చెందిన ప్రమాద రహిత డ్రైవర్లు, ఉత్తమ డ్రైవర్లకు శాలువాలతో సన్మానించి నగదు ప్రోత్సహాకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపో మేనేజర్లు సురేష్ కుమార్, కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం