గులాబీలో జోష్..!
– కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరికలు
– కండువాలు కప్పి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల జోష్ నిండుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. గురువారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి.

తాండూరు పట్టణం 3వ వార్డుకు చెంది మాజీ కౌన్సిలర్ భీం సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అల్లుడు సురేష్ నాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని రోహిత్ రెడ్డి అన్నారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

