నామినేషన్ల పరిశీలనలో పొరపాట్లు చేయొద్దు
– వికారాబాద్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జి.రవి
– తాండూరు మున్సిపల్లో స్క్రూట్నీ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసుకున్న నామినేసన్ల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని వికారాబాద్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జీ.రవి సూచించారు.

శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థుల స్క్రూట్నీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. నామినేషన్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. పట్టణంలోని 36వార్డులకు గాను అభ్యర్థులు దాఖలు చేసుకున్న నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలనను చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. పరిశీలననలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల పత్రాలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించాలన్నారు. పరిశీలన తరువాత అభ్యర్థులకు ఎమైనా సందేహాలు ఉంటే నివృతి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డి మంగీలాల్, మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

