పటేల్ ప్రవీణ్ కు ఎమ్మెల్యే నివాళులు..!
– యువత మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువ నేత పటేల్ ప్రవీణ్ మృతదేహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాళులు అర్పించారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన పటేల్ ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పటేల్ ప్రవీణ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. చిన్నతనంలోనే ప్రవీణ్ అనంతలోకాలకు వెళ్లడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

